కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం పై స్పందించిన కేసీఆర్ | KCR Explanation About Congress MLA's

2019-07-18 1

Telangana CM KCR Explanation in Assembly about congress party mla's jumpings into trs. The Congress party mla's joins into trs means that is the failue of party, he says.
#cmkcr
#assembly
#congress
#mla
#trs
#telangana
#hyderabad

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. టీడీపీ సహా ఇతర పార్టీలతో జట్టుకట్టి మహాకూటమిగా ఏర్పడ్డ కూడా రాజకీయ చదరంగంలో హస్తం పాచికలు పారలేదు. దాంతో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 19 సెగ్మెంట్లలోనే విజయం సాధించింది. అయితే అందులో 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కారెక్కేశారు. ఆ క్రమంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది గులాబీగూటికి చేరితే ఇక మిగిలింది ఏడుగురే. టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడానికి ఈ సంఖ్యాబలం ఎక్కడ సరిపోతుందనే వాదనలున్నాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ కావడానికి ఆ పార్టీ విధానాలే తప్పని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించడం చర్చానీయాంశమైంది.

Videos similaires